Last Updated:

Heart Attack: కలవరపెడుతున్న గుండెపోటు మరణాలు.. దీనికి కారణం ఇదేనా?

Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పదం. వరుస గుండెపోటు మరణాలతో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చిన్న, పెద్ద.. ధనిక, పేద వయసుతో సంబంధమే లేకుండా అందరిని కాటేస్తోంది గుండెపోటు. యువత, ఆరోగ్యవంతులు ఇలా ఎవరిని కూడా వదలడం లేదు.

Heart Attack: కలవరపెడుతున్న గుండెపోటు మరణాలు.. దీనికి కారణం ఇదేనా?

Heart Attack: గుండెపోటు మరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని కలవరపెడుతుంది. ఉన్నట్టుండి గుండెపోటుకు గురై అక్కడికక్కడే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలు ఇలా సడెన్ గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటి.. ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. గుండెపోటు రావడానికి కరోనా పాత్ర ఏమైనా ఉందా?..

ఈ మధ్యకాలంలో పెరిగిన గుండెపోటు మరణాలు.. (Heart Attack)

గుండెపోటు.. ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పదం. వరుస గుండెపోటు మరణాలతో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చిన్న, పెద్ద.. ధనిక, పేద వయసుతో సంబంధమే లేకుండా అందరిని కాటేస్తోంది గుండెపోటు. యువత, ఆరోగ్యవంతులు ఇలా ఎవరిని కూడా వదలడం లేదు. చాలా మంది ఉన్నట్టుండి సడెన్ గా గుండెపోటుతో.. కుప్పకూలిపోతున్నారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. హర్ట్ ఎటాక్ మరణాలు ఈ మధ్య మరింత పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. మరి ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది. ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటనే ప్రశ్నలు అందిరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఆరోగ్యంగా ఉన్న కూడా గుండెపోటు..

ఈ మధ్య కాలంలో హర్ట్ ఎటాక్ మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో అధికంగా చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆరోగ్యంగా ఉన్న ఆ కానిస్టేబుల్ హఠాత్తుగా గండెపోటుకు గురై చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలో బంధువుల ఇంట పెళ్లికి వచ్చిన 19ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా కార్డియాక్ అరెస్ట్ అని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ లో మరో 38ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నట్టుండి గుండెపోటుకి గురయ్యాడు. రోజు సాయంత్రం క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ ఆడుతూ బాడీని ఫిట్ గా ఉంచుకునే వాడు. అయినా కూడా గుండెపోటు రూపంలో అకాల మృత్యువు అతడిని వెంటాడింది. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. స్నేహితులతో మాట్లాడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. గుండె పోటు మరణాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

గుండెకి ఏమైంది? ఇందులో కరోనా పాత్ర ఉందా?

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ కార్డియాక్ అరెస్ట్ తో ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఇలా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన రేపుతోంది. పట్టరాని ఆనందం వచ్చినా.. భయాందోళనకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏ కారణం లేకుండానే గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. అలా తరచూ జరగడం గుండెపోటు లక్షణంగా చెబుతున్నారు డాక్టర్లు. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వాదన బలంగా వినిపిస్తుంది. కానీ ఈ మరణాలకు కరోనాయే కారణం అని చెప్పే సరైన ఆధారాలు లేవని వైద్యులు అంటున్నారు. కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని.. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుండెపోటుతో ప్రముఖులు మృతి

వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటుతో పలువురు సెలబ్రిటీలు సైతం హఠాత్తుగా మరణించిన ఘటనలు కలకలం రేపాయి. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇటీవలే నందమూరి తారకరత్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.