Chikoti Praveen:థాయ్ లాండ్ లో చికోటి ప్రవీణ్ కు బెయిల్ మంజూరు
Chikoti Praveen: థాయ్‌లాండ్ లో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్టైన విషయం తెలిసిందే. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అతను పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ కు బెయిల్ మంజురైంది.
Chikoti Praveen: థాయ్‌లాండ్‌లో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్టైన విషయం తెలిసిందే. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అతను పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ కు బెయిల్ మంజురైంది. థాయ్‌లాండ్‌లో నేరం రుజువైతే కఠిన శిక్షలు ఉంటాయి.
బెయిల్ మంజూరు.. (Chikoti Praveen)
థాయ్‌లాండ్ లో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్టైన విషయం తెలిసిందే. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అతను పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ కు బెయిల్ మంజురైంది. థాయ్‌లాండ్ లో నేరం రుజువైతే కఠిన శిక్షలు ఉంటాయి.
గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్‌లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు. ఈ మేరకు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రవీణ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు.. మరో 83 మందికి బెయిల్ మంజూరైంది. కోర్టు విధించిన ఫైన్ కట్టిన నేపథ్యంలో.. పాస్ పోర్టులను తిరిగి ఇచ్చేశారు.
ఈ అరెస్ట్ పై చికోటి ప్రవీణ్ స్పందించాడు. థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ నిషేధం ఉన్న విషయం తనకు తెలియదన్నాడు.
100 కోట్ల బెట్టింగ్..
థాయ్‌ల్యాండ్‌లోని .హోటల్‌లో భారతీయులు గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. పటాయాలో 90 మంది భారతీయుల అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు.
అరెస్టైన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. థాయ్‌ల్యాండ్ మహిళతో కలిసి చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు.
రూ 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్, 92 సెల్‌ఫోన్లు, 3 నోట్‌బుక్స్, ఐప్యాడ్ , 1.60 లక్షలు థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
100 కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు.
చికోటి ప్రవీణ్‌పై నేపాల్, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో జూదం ఆడుతున్నాడని పలు కేసులు నమోదు చేశారు.
ప్రవీణ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టింది.
హవాలా డబ్బు లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో జూలై 29న అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించడంతో ప్రవీణ్ పేరు వెలుగులోకి వచ్చింది.