Last Updated:

Apple iPhone: యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్..!

ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్‌ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.

Apple iPhone: యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్..!

Apple iPhone: ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐఫోన్ గురించి తెలియనివారుండరు. అందులోని ఆపరేటింగ్ సిస్టం, సెక్యూరిటీ సర్వీసెస్‌, ఫీచర్స్‌ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే దానికి ధర ఎక్కువే డిమాండ్‌ కూడా ఎక్కువే. అయితే యాపిల్‌ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.

తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ సంస్థతో కలిసి యాపిల్‌ సంస్థ ఈ ఐఫోన్లు తయారు చేస్తోంది. దానితో అతి త్వరలో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 దేశీయ మార్కెట్లోకి రానుంది. కాగా త్వరలోనే వీటిని మార్కెట్లోకి అందుబాటులో ఉంచుతామని యాపిల్ యాజమాన్యం తెలిపింది. ఇకపోతే దేశీయంగా ఐఫోన్లు తయారీ అవుతున్నాయి కాబట్టి వీటి ధర తగ్గే అవకాశం ఉండచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే యాపిల్‌ తన 2022 ఐఫోన్‌ లైనప్‌ను సెప్టెంబర్ 7న ‘ఫార్ అవుట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఆ సిరీస్‌లో ఐ ఫోన్‌ 14, ఐ ఫోన్‌ 14 ప్రో, ఐ ఫోన్‌ 14 ప్రో మాక్స్ తో పాటు సరికొత్త ఐ ఫోన్‌ 14 ప్లస్ చరవాణీలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచే ఆ 13 పట్టణాల్లో 5జీ సేవలు

ఇవి కూడా చదవండి: