Allu Arjun: అల్లు అర్జున్‌కి ఓ అభిమాని రిక్వెస్ట్ – వెంటనే స్పందించిన బన్నీ, అదేంటంటే..
Allu Arjun Reply to Fan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్, మ్యానరిజం, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో నార్త్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంతగా అంటే ఏకంగా యూపీ నుంచి ఓ అభిమాని సైకిల్‌పై హైదరాబాద్‌లో వచ్చి బన్నీని కలుసుకున్నాడు. దీంతో అతడిని తన నివాసంలో కలిసి అతడితో కాసేపు మాట్లాడాడు బన్నీ. తాజాగా ఓ అభిమాని విష్‌ని తీర్చి మరోసారి ఫ్యాన్స్ హీరో అనిపించుకున్నాడు బన్నీ.
ట్విటర్‌లో ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశాడు. “చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ అభిమానిగా నాదోక కోరిక. ఈ రోజు ఆయన నుంచి నాకు విషెస్ వస్తే అదే నాకు హ్యాపీ. ఇది కుదరదని తెలుసు. కానీ, బన్నీ విషెస్ కోసం వెయిట్ చేస్తున్నా” అంటూ అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేశాడు. ఇక అది చూసి బన్నీ వెంటనే అతడికి రిప్లై ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే అంటూ ఫ్యాన్‌కి బర్త్‌డే విషెస్ చెప్పాడు. దీంతో ఆ అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. థ్యాంక్యూ సో మచ్ అన్నా అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. బన్నీ విషెస్‌తో ఎక్స్‌లో సదరు అభిమానికి ఇతర ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఇది కొందరు లక్కీ ఫేలో అంటున్నారు. మరికొందరు బన్నీ సింప్లిసిటీని కొనియాడుతున్నాడు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 డిసెంబర్ రిలీజైన పుష్ప పార్ట్ వన్‌కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన మూడేళ్లు గడుస్తుంది. ఎప్పుడో పార్ట్ 2 షూటింగ్ మొదలైన స్లో స్లోగా పుష్ప 2 షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఇటీవల మూవీని వాయిదా వేస్తూ డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పుష్ప 2 రిలీజ్ డేట్‌ను మార్చేసి కొత్త డేట్ ప్రకటించారు. చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందే సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు.
Happy Birthday 🖤
— Allu Arjun (@alluarjun) October 24, 2024