Allu Arjun: అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ – కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు బన్నీ
Judicial Remand to Allu Arjun హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కాసేపట్లో అల్లు అర్జున్‌ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరించనున్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయనను చిక్కడపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు వివరాలను పోలీసులు మేజిస్ట్రేట్‌కు వివరించగా అల్లు అర్జున్‌కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కాసేపట్లో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
కాగా డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ నేపథ్యంలో ముందురోజు భారీ ఎత్తున బెన్‌ఫిట్ షోలు వేశారు. అలాగే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో కూడా షోలు వేశారు. దీంతో అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో పాటు హీరోయిన్ రష్మికతో సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ వచ్చాడని తెలిసింద అభిమానులంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా ఈ ఘటనలో ఓ రేవతి అనే మహిళ మరణించింది. దీంతో ఆమె భర్త చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య యాజమాన్యం ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.