Last Updated:

Bachhala Malli Trailer: లవ్‌, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్‌ ‘బచ్చల మల్లి’ ట్రైలర్‌

Bachhala Malli Trailer: లవ్‌, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్‌ ‘బచ్చల మల్లి’ ట్రైలర్‌

Bachhala Malli Official Trailer: ‘అల్లరి’ నరేష్‌ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘బచ్చల మల్లి’. డిసెంబర్‌ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉండటంతో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. హీరో నాని చేతుల మీదుగా డిసెంబర్‌ 14న ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఇప్పటికే బచ్చల మల్లి మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో నరేస్‌ మాస్‌ అవతార్‌ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ మూవీపై మరిన్ని అంచనాలు పెంచింది.

అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇందులో అల్లరి నరేష్‌ ఊరమాస్‌ అవతార్‌లో కనిపించాడు. యాక్షన్‌, ఎమోషన్స్‌లో ఆద్యాంతం ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. అటు టైటిల్ రోల్ లో అల్లరి నరేష్ యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవెల్లో ఉందంటున్నారు. మాస్‌ హీరోగా నరేష్‌ తన యాక్టింగ్‌తో బార్డర్‌ దాటేశాడంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఇందులో పలు డైలాగ్స్‌ అయితే ట్రైలర్‌ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకువెళ్లాయి. పోలీసు మామయ్య దెబ్బలు సరిగ్గా ఆనట్లేదు.. కొంచం గట్టిగా ట్రై చేయ్‌ అనే డైలాగ్‌ ఆకట్టుకుంది.

“మనిషిలో బీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌ కోలవడానికి మిషన్లు వచ్చాయి.. ముర్ఖత్వం కొలవడానికి ఇంకా రాలేదు. ఒకవేళ ఉండుంటే నీ విషయంలో అది బోర్డర్‌ దాటేంతది”అనే డైలాగ్‌ నరేష్‌ పాత్ర స్వభాన్ని తెలియజేస్తుంది. ఈ డైలాగ్‌ బట్టి చూస్తుంటే నరేష్‌ ఇందులో ముర్ఖత్వంతో అందరిని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్‌ అని తెలుస్తోంది. ఆ తర్వాత ట్రైలర్‌ యాక్షన్, విలన్‌తో హీరో చేసే శబథం వంటి సీన్స్‌ ఆసక్తిని పెంచుతున్నాయి. చివరిలో నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్న నీకే ఎక్కువ తెలుసు అని అనే డైలాగ్‌ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్‌ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఆద్యాంతం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్‌ మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. బచ్చల మల్లి నరేష్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌ ఖాయం అంటున్నారు ఆడియన్స్‌.

ఇవి కూడా చదవండి: