Last Updated:

Viral News: కర్మకాండలకూ ఓ స్టార్టప్.. ఇదేం కర్మరా అంటున్న నెటిజన్లు

ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఇలాంటి ఓ కంపెనీని చూస్తామని కానీ ఊహించలేందంటూ పలువురు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారికి కర్మకాండలు జరిపిస్తుందట.

Viral News: కర్మకాండలకూ ఓ స్టార్టప్.. ఇదేం కర్మరా అంటున్న నెటిజన్లు

Viral News: దేశంలో కొత్తకొత్త ఆలోచనలతో నవతరం విభిన్న స్టార్టప్ లతో ముందుకొస్తోంది. తమ ఆలోచనలే ఆయుధంగా మలచుకుని కార్యరూపంలో చూపెడుతోంది. ఫలితంగా ప్రపంచంలో మరే దేశంలో లేనంతంగా మన దేశంలో స్టార్టప్‌ల హవా కొనసాగుతుంది. అయితే తాజాగా, ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఇలాంటి ఓ కంపెనీని చూస్తామని కానీ ఊహించలేందంటూ పలువురు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారికి కర్మకాండలు జరిపిస్తుందట.

‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ముంబైలో ఈ స్టార్టప్ ఏర్పాటయ్యింది. ఇది కర్మకాండలతోపాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలు అందిస్తుంది. కాగా ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ఈ స్టార్టప్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. దానితో పాటు ఇలాంటి స్టార్టప్‌లతో అవసరం ఏముంది? అని కామెంట్ రాశారు. దీనిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని పెద్దలు చెప్పేవారని, ఇప్పుడది నిజమైందని కొందరు అంటుంటే.. మనకంటే ఇలాంటి సేవలు కొత్త కావొచ్చు కానీ అమెరికాలో మాత్రం మామూలేనని మరికొందరు కామెంట్ చేశారు. ఇకపోతే కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట.

ఇదీ చదవండి: చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ సమాధి సిద్దం చేసుకున్న పాస్టర్

ఇవి కూడా చదవండి: