Pak MP Syed Mustafa Kamal : టాప్ కంపెనీలకు సీఈవోలుగా ఇండియన్స్.. మన పిల్లలు ఆకలితో చస్తున్నారు..పాక్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్
ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలకు ఇండియన్స్ సీఈవోలుగా పనిచేస్తున్నారు. అదే మన పిల్లలు ఆకలితో చస్తున్నారని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సయ్యద్ ముస్తాఫా కమల్ అనే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ విద్యా వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Pak MP Syed Mustafa Kamal : ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలకు ఇండియన్స్ సీఈవోలుగా పనిచేస్తున్నారు. అదే మన పిల్లలు ఆకలితో చస్తున్నారని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సయ్యద్ ముస్తాఫా కమల్ అనే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ విద్యా వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ రోజు కరాచీ పరిస్థితి చూడండి. ప్రపంచం చంద్రమండలం మీదికి పోతుంటే మనం కరాచీలో మురికి కాల్వలోకి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాలను పోల్చి చూపిస్తూ.. 30 ఏళ్ల క్రితం మన పొరుగున ఉన్న ఇండియాతో తమ పిల్లలకు ఏవైతే విద్యా బుద్ధులు నేర్పిందో ఇప్పడు అదే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.. అందుకే ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలకు ఇండియన్స్ సీఈవోలుగా ఉన్నారని చెప్పారు.
ఇండియా దూసుకుపోతోంది..(Pak MP Syed Mustafa Kamal)
ఈ రోజు ఇండియా ఆర్థికంగా ముందుకు దూసుకుపోతోంది. దీనికి కారణం వారు ముందుచూపుతూ తమ విద్యార్థులకు సరైన విద్య బోధించారు. మన ఐటి ఎగుమతులు చూడండి కేవలం 700 కోట్ల డాలర్లు అదే ఇండియా ఐటి ఎగుమతులు చూస్తే 27,000 కోట్ల డాలర్లు అని ఎంక్యూఎం నాయకుడు నేషనల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన స్కూళ్లలో నిరక్షరాస్యత విపరీతంగా పెరిగిపోయింది. పాకిస్తాన్‌లో రెండు కోట్ల మంది పిల్లలు స్కూళ్లకు హాజరు కాలేకపోతున్నారు. దీనిపై మనం ఫోకస్ పెడితే విద్యా వ్యవస్థ లోపం గురించి ప్రస్తావిస్తూ.. మన నాయకులకు నిద్రపట్టదని పాక్ ఎంపీ అన్నారు.పాక్ ఎంపీ వీడియోలు ప్రస్తుతం ఎక్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండియన్ సోషల్ మీడియాలో ఎంక్యూఎం -నాయకుడు ఇండియాను పాకిస్తాన్‌తో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియాతో కాదు మీరు పోల్చాల్సింది ఆఫ్గానిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌తో అని చురకలంటించారు. ఈ రెండు దేశాలతో పోల్చుకుంటే వారితో మనమే బెటర్ అనేస్థాయికి పాక్ రాజకీయ నాయకులు వచ్చి తృప్తి పడవచ్చునని సలహా ఇచ్చారు. ఇండియా ప్రస్తుతం మరో కక్ష్యలో ఉందని ఒక యూజర్ పేర్కొన్నాడు.
పాకిస్తాన్ అభివృద్దికి అడ్డుపడుతోంది అక్కడి మతం. వారు కూడా సెక్యూలర్ అయితే అభివృద్ది రుచి చూడవచ్చునని మరో యూజర్ సూచించాడు. పాక్ ప్రజలు మతాన్ని వెనక్కి నెట్టి ముందుకు వస్తే అభివృద్ది సాధించే అవకాశాలున్నాయి. అదే విధంగా అన్నీ విషయాల్లో సైనిక జోక్యం పక్కన పెట్టాలి. అలాగే టెర్రర్ ఆర్గనైజేషన్‌లను అణిచి వేస్తే కానీ అభివృద్దికి ఆస్కారం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా ఆప్గానిస్తాన్‌లో బాటలో పయనిస్తోంది. పాక్ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఐఎంఎఫ్ నుంచి ప్రపంచంలోని ప్రతి దేశం ముందు సాయం కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుచూపు మేరలో పాక్‌కు మోక్షం లేదనేది ఇండియన్ యూజర్స్ అభిప్రాయం.