Boda Kakarakaya: బోడ కాకరకాయను తినండి.. బీపీని తగ్గించుకోండి
మనకి కూరగాయాలు అన్ని వేళలా దొరుకుతాయి. కానీ బోడ కాకరకాయ మాత్రం అన్ని సమయాల్లో దొరకదు. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది.
Boda Kakarakaya: మనకి కూరగాయాలు అన్ని వేళలా దొరుకుతాయి. కానీ బోడ కాకరకాయ మాత్రం అన్ని సమయాల్లో దొరకదు. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది. ఇళ్ళ దగ్గర వీటిని పండించిన ఎక్కువ పండవు. అడవుల్లో ఇవి బాగా దొరుకుతాయి. ఇది సీజన్ కూరగాయ అవ్వడం వలన దీని ధర కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్ లో బోడ కాకరకాయ కేజీ రూ.200 నుంచి 250 వరకు దీని ధర పలుకుతుంది.
డయాబెటిక్
డయాబెటిక్ పేషంట్లకు ఇది మంచి ఆహారం. ఎందుకంటే దీనిలో షుగర్ను అదుపు చేసే గుణాల ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రక్తంలోని సుగర్ను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఎలా ఐనా చేసుకొని తినవచ్చు ఎలా చేసుకొని తిన్నా తొందరగా అరిగిపోయే మంచి ఆహారం ఇది. కొంతమంది బోడకాకరతో పులుసు, వేపుడు కూర, ఇలా చేసుకొని తింటారు.
బీపీ
బీపీని కంట్రోల్ చేయడంలో ఇది బాగా పని చేస్తుంది. కానీ దీన్ని వానాకాలంలో తినవద్దని చెబుతుంటారు. తింటే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని మనం రోజూ తీసుకోవడం వలన బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కూడా అదుపులోకి వస్తాయి. బోడకాకరలో ఫోలేట్స్ ఎక్కువ శాతం ఉంటాయి. దీని వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా గర్భిణులు దీన్ని ఎక్కువుగా తీసుకోవడం వలన శిశువు ఎదుగుదలకు చాలా మంచిదని పరిశోధనలో నిపుణులు వెల్లడించారు.