Last Updated:

Winter Foods: చలికాలంలో పిల్లలకు శక్తినిచ్చే స్నాక్స్ ఇవే..!

చలికాలం వచ్చిందంటే చాలు చిన్నాపెద్ద అందరూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా ఆహారం తీసుకోరు. మరి వారికి ఎలాంటి ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెంచవచ్చో ఓ సారి చూసేద్దాం.

Winter Foods: చలికాలంలో పిల్లలకు శక్తినిచ్చే స్నాక్స్ ఇవే..!

Winter Foods: చలికాలం వచ్చిందంటే చాలు చిన్నాపెద్ద అందరూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా ఆహారం తీసుకోరు. మరి వారికి ఎలాంటి ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెంచవచ్చో ఓ సారి చూసేద్దాం.

బెల్లం: చలికాలంలో పిల్లలకు బెల్లంతో చేసిన ఆహారాలను అందించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. బెల్లంలో ప్రోటీన్, కోలిన్, బీటైన్, విటమిన్ బీ12, బీ6, ఫోలేట్, కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది.

కోడిగుడ్లు: చలికాలంలో చిన్నారులకు నిత్యం కోడిగుడ్డు తినిపించాలి. వివిధ రకాలుగా గుడ్డుతో వంటకాలు చేసి పెట్టడం ద్వారా హాయిగా తింటారు చిన్నారులు.
గుడ్డులో అనేక ప్రోటీన్లు, పోషకాలు పిల్లలకు అందుతాయి.

ఉసిరి: శీతాకాలంలో విరివిగా లభించే ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచడంతో కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లూ, జలుబు, జీర్ణ సమస్యలు వంటి సాధారణ వ్యాధులను
నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఖర్జూరం: ఖర్జూరం పండ్లు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి. ఇవి హార్మోన్ నియంత్రణ, వాపు తగ్గింపు, రోగనిరోధకత పెంపుదలకు మద్దతుగా నిలుస్తాయి.
ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉండి అనేక రోగాల బారి నుంచి మనల్ని కాపాడుతుంది.

సిట్రస్ జాతి పండ్లు: సీ విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినిపించాలి. ఇవి చిన్నారుల్లో వ్యాధినిరోధక వ్యవస్థకు పెంచడానికి సహాయపడతాయి.

బీట్‌రూట్: వీటిలో అధిక మొత్తంలో పీచు ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే, రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల నివారణలో సాయపడుతుంది.

సూప్‌లు: చలి వాతావరణంలో వేడిని అందించేందుకు పిల్లలకు ఎక్కువగా సూప్‌లు ఇవ్వాలి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. సూప్‌లలో పాలకూర, బ్రోకలి, మష్రూమ్‌, బీన్స్‌, బీట్‌రూట్, చికెన్‌ ముక్కలు,
మటన్‌ స్టిక్స్‌ వంటివి కూడా చేర్చి రుచి, శక్తిని మెరుగుపర్చవచ్చు.

డ్రైఫ్రూట్స్ నట్స్: జీడిపప్పు, బాదాం, వేరుశనగ, పిస్తా, వాల్‌నట్‌ వంటివి ఎక్కువగా తినిపించాలి. నేరుగా తినకపోతే పొడిగా చేసి కూరల ద్వారా అందివ్వాలి.

ఇదీ చదవండి: శీతాకాలంలో జలుబుకు చెక్ పెట్టండిలా..!

ఇవి కూడా చదవండి: