Last Updated:

Tamannaah Bhatia: తమన్నా బౌన్సర్ల పై మండిపడుతున్న జర్నలిస్టులు

మన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ప్రెస్ మీట్ హైద్రాబాద్ జరిగినది. ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెద్ద వివాదంగా మారింది. ప్రెస్ మీట్ అనంతరం అక్కడ ఉన్న బౌన్సర్లు హద్దుమీరి ప్రవర్తించారు.

Tamannaah Bhatia: తమన్నా బౌన్సర్ల పై మండిపడుతున్న జర్నలిస్టులు

Tollywood: తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ప్రెస్ మీట్ హైద్రాబాద్ జరిగినది. ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెద్ద వివాదంగా మారింది. ప్రెస్ మీట్ అనంతరం అక్కడ ఉన్న బౌన్సర్లు హద్దుమీరి ప్రవర్తించారు. తమన్నాను ఫోటోలు తీసుకుంటున్న సమయంలో మీడియా కెమెరామెన్ల పై దురుసుగా ప్రవర్తించి, వారి మీదకు వెళ్లారు. ఈ గోడవలో తమన్నా బౌన్సర్లు ముగ్గురు కెమెరామెన్ల పై చేయి చేసుకోవడం జరిగినది. ఇదంతా చూసిన మీడియా వారు దీన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం అందరూ తమన్నా పై కూడా మండిపడుతున్నారు.ఈ ఎఫెక్ట్ తమన్నా సినిమా పై పడిన మనం ఆశ్చర్యాపడాలిసి అవసరం లేదు. ఇలాంటి బౌన్సర్ల ను ఎలా పెట్టుకున్నారు ? ఇంతకన్నా మించిన మీకు మంచి బౌన్సర్లు దొరకలేదా అంటూ మీడియా ప్రతినిధులు తమన్నాతో పాటు ఈవెంట్ వారి పై కూడా చేరుబురులడారు. మీడియా వారు 30 నిమిషాల పాటు అందోళనకు దిగారు. మా మీద దాడి చేసిన బౌన్సర్లు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలని గొడవ చేయగా,అప్పుడు తమన్నా బౌన్సర్లు మీడియా వారికి క్షమాపణ చెప్పిన తరువాత వ్యవహారం సద్దుమనిగింది.

ఇప్పటి కైనా బౌన్సర్లు తీరు మార్చుకుంటే మంచిదని, మీడియా వారంటే అంత చులకనగా కనిపిస్తున్నారా ? తెలుగు జర్నలిస్టులందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చదవండి: