Last Updated:

సంతోషం అవార్డ్స్: సంతోషం OTT అవార్డ్స్ వేడుకలో మెరిసిన సినీ ప్రముఖులు

21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్నసురేష్ కొండేటి మొట్ట మొదటి సారిగా OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు.

సంతోషం అవార్డ్స్: సంతోషం OTT అవార్డ్స్ వేడుకలో మెరిసిన సినీ ప్రముఖులు

Santhosham Awards: 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్నసురేష్ కొండేటి మొట్ట మొదటి సారిగా OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు. అలాగే సంతోషం 21 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరై సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా 2021,22 లకు గాను ప్రేక్షకులను అలరించిన నటి నటులు, టెక్నీషియన్స్ లను సంతోషంగా అవార్డులతో సత్కరించారు. ముందుగా 2021 కి సంబంధించిన విజేతల లిస్ట్ చూస్తే బెస్ట్ వెబ్ సీరీస్ గా హాట్ స్టార్ లో ప్రసారం అయిన పరం పర నిలవగా… ఆ అవార్డును నిర్మాత శోభు యార్లగడ్డ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డు సేనాపతి సినిమాకి గాను రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. సినిమా బండి సినిమాకి గాను ప్రవీణ్ కండ్రేగుల అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఒక చిన్న ఫ్యామిలీ కథ సీరీస్ కి మహేష్ ఉప్పల అందుకున్నారు.

2022 కి సంబంధించిన అవార్డుల విషయానికి వస్తే బెస్ట్ విలన్ రెక్కీ సిరీస్ కి గాను సమ్మెట గాంధీ అందుకున్నారు. బెస్ట్ వెబ్ సీరీస్ అవార్డును గాలివాన దక్కించుకోగా నిర్మాత శరత్ కుమార్ ఆ అవార్డును అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డును అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్ కి రాజ్ తరుణ్ అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గాలివాన వెబ్ సీరీస్ కి శరణ్ కొప్పిశెట్టి అందుకున్నారు. బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డును అహా నా పెళ్ళంట వెబ్ సెరిస్ కి రాహుల్ తమడ, సాయి దీప్ అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ మేల్ అవార్డును గాలి వాన వెబ్ సీరీస్ కి సాయి కుమార్ అందుకున్నారు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ అవార్డు గాలి వాన వెబ్ సీరీస్ కి చాందిన చౌదరి అందుకోవల్సి ఉండగా. అదే సీరీస్ లో సావిత్రి పాత్ర పోషించిన మరో నటి అందుకున్నారు. బెస్ట్ పర్ఫార్మర్ ఫిమేల్ అవార్డును గాలివాన వెబ్ సీరీస్ కి రాధిక శరత్ కుమార్ ను వరించగా ప్రొడ్యూసర్ శరత్ పరార్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 9 హవర్స్ సిరీస్ కి గాను శక్తి కాంత్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎడిటర్ అవార్డును గాలివాన వెబ్ సీరీస్ కి గాను సంతోష్ కామిరెడ్డి అందుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును 9 హవర్స్ వెబ్ సీరీస్ కి మనోజ్ రెడ్డి అందుకున్నారు.

ఈ వేదిక పై నటరాజ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలకు బిగ్ బాస్ ఫేమ్ మానస్, విశ్వ, భాను శ్రీ, సోషల్ మీడియా స్టార్ భ్రమరాంబ స్టెప్పులు వేసి అలరించారు. ముందుగా సంతోషం ఓటీటీ కర్టెన్ రైజర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ నెల 26వ తేదీన జరగబోతున్న సంతోషం గ్రాండ్ ఈవెంట్ కి సంబంధించిన కర్టెన్ రైజర్ ను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శ్రీ లీల లాంచ్ చేశారు.

ఇవి కూడా చదవండి: