Last Updated:

Ram Gopal Varma : అలా చేసుంటే మెగాస్టార్ ఒక పెద్ద ఫెయిల్యూర్ పర్సన్ అయ్యేవారు : వర్మ

Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు అస్సలు ఉండరు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉంటారు వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ” డేంజరస్ ” అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో

Ram Gopal Varma : అలా చేసుంటే మెగాస్టార్ ఒక పెద్ద ఫెయిల్యూర్ పర్సన్ అయ్యేవారు : వర్మ

Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు అస్సలు ఉండరు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉంటారు వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ” డేంజరస్ ” అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగోలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ తరుణంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా లోకి రాకపోయి ఉంటే, మరే రంగంలో రాణించేవారని మీ అభిప్రాయం అనే ప్రశ్నను యాంకర్ అడిగారు. అందుకు వర్మ మాట్లాడుతూ… చిరంజీవి యాక్టింగ్ కెరీర్ లో కాకుండా మిగతా అన్ని రంగంలో ఒక బిగ్ ఫెయిల్యూర్ గా నిలిచేవారు. ఆయనకి ఉన్న మెంటాలిటీకి సినిమాలు కాకుండా ఏది చేసిన పెద్ద ప్లాప్ అయ్యేవారని నా ఫీలింగ్ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అలానే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పలువురు యువతులు అడిగిన బొల్డ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి పాదాలకు ముద్దుపెట్టి రచ్చ చేశారు.

మరి ఈ తరుణంలో మెగాస్టార్ పై చేసిన కామెంట్స్ పట్ల ఆయన అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ” వాల్తేరు వీరయ్య ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి 13 న విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇవి కూడా చదవండి: