Pawan Kalyan-Atlee: పవన్ కళ్యాణ్- అట్లీ- త్రివిక్రమ్ మూవీ ఫిక్స్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.

Pawan Kalyan-Atlee: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
త్వరలోనే క్లారిటీ..( Pawan Kalyan-Atlee)
మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ మరో ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. అట్లీ చాలా కాలంగా అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్‌లతో చర్చలు జరుపుతున్నాడు. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయింది.దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అల్లు అర్జున్ – అట్లీ మూవీ ప్రారంభమయితే పవన్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో త్రివిక్రమ్‌తో కలిసి పనిచేస్తే అట్లీ మొదట పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేస్తాడు. షారుఖ్ ఖాన్‌తో అట్లీ గత చిత్రం జవాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో అట్లీ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న డైరక్టర్లలో ఒకరిగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
- Megastar Chiranjeevi Comments: ఎన్టీఆర్ మాటలు విని భూములు కొన్నాను.. మెగాస్టార్ చిరంజీవి
- Prime Minister Narendra Modi: ప్రధాని మోదీకి గజరాజు ఆశీర్వాదం