Home / ustaad bhagat singh
పవన్ హరీష్ శంకర్‌తో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు పండగే. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన గబ్బర్ సింగ్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోమారు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే పేరుతో ఆ మూవీకి నామకరణం చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఆ సినిమా పేరును మార్చుతూ మరో అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.