Last Updated:

JR NTR : హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో “దేవర”, ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్ లలో తనకు తానే పోటీ అనేలా తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరో అనిపించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసు లోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస

JR NTR : హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో “దేవర”, ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్

JR NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్ లలో తనకు తానే పోటీ అనేలా తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరో అనిపించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసు లోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులను ఎదుర్కున్నారు. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఎన్టీఆర్.. ప్రేక్షకులను మాత్రం ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూ అలరిస్తున్నాడు. ఆది సినిమా బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్.. ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి.

ఇక నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు భారీ ఎత్తున తారక్‌ కి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. ఓ పండగల ఎన్టీఆర్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తూ ఫుల్ హంగామా సృష్టిస్తున్నారు. ఇక తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని మే 19 వ తేదీన కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఎన్టీఆర్ 30 మూవీ ఫస్ట్ లుక్ ను .. టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు “దేవర” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన తారక్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ రాబోతుందని మొదటి నుంచి చెప్పున్న మాటలకు ఈ పోస్టర్ మరింత ఊపు ఇచ్చింది.

Image

“దేవర” సినిమాలో మరో ప్రత్యేక విషయం ఏంటి అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రాబోతుండడం. అలానే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసేశారు. తాజాగా మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయి అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈరోజు ఎన్టీఆర్ మానియాతో సోషల్ మీడియా మోత మోగిపోతుంది.