Last Updated:

Pawan Kalyan OG: పవన్ #OG మూవీ.. అభిమాన హీరోకి హిట్ ఇవ్వడానికి.. అభిమానే రంగంలోకి

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్.ఇవి కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు.

Pawan Kalyan OG: పవన్ #OG మూవీ.. అభిమాన హీరోకి హిట్ ఇవ్వడానికి.. అభిమానే రంగంలోకి

Pawan Kalyan OG: ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్.

ఇవి కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు.

అలానే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

సుజీత్‌ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈరోజు అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్‌ పూజ కార్యక్రమం నిర్వహించింది.

డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పుడు ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

 

అభిమాన హీరో (Pawan Kalyan OG) కోసం.. రంగంలోకి దిగుతున్న కల్ట్ ఫ్యాన్స్..

 

ఓజీ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్ కన్ఫర్మ్‌గా చెబుతున్నారు. దీనికి కారణాలూ ఉన్నాయి.

ఇలాంటి సినిమా.. ఇంత స్థాయిలో.. తెలుగు తెరమీద రాలేదు.

పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలో నటించలేదు. పైగా, ఇది పవన్‌కు చాలా నచ్చిన పాత్ర.

వీటన్నింటికీ తోడు.. ఈ మధ్యకాలంలో కల్ట్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టింది.

కమల్ హాసన్ విక్రమ్, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి.. ఈ సినిమాల డైరెక్టర్లు అందరూ ఆ హీరోలకు వీరాభిమానులు.

ట్విటర్‌లో ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతోంది.

తమ అభిమాన హీరోకి మళ్లీ మునుపటి వైభవం తీసుకురావడానికి అభిమానులే దర్శకులుగా వస్తారని ట్రెండ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు ఇది సరిపోతుందా లేదా అనేది పక్కనపెడితే.. సుజిత్ మాత్రం పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.

ఒకప్పుడు థియేటర్లకు వెళ్లి, ఎర్ర కండువా తలకు కట్టుకుని మరీ జై పవర్ స్టార్ అని నినాదాలు చేసిన కల్ట్ ఫ్యాన్.

అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి.. ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

 

 

(Pawan Kalyan OG) మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్..

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ కాస్ట్ అండ్ క్రూ గురించి అంతా విపరీతంగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి అనిరుధ్  సంగీతం అందిస్తాడని పవన్ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ తమన్ కొట్టేశాడు.

తమన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన  భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాల్లో తమన్ కొట్టిన బీజీఎంకి పవన్ ఫాన్స్ ఫిదా అయ్యారు.

దీంతో తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అదరగొట్టాలి అని.. హ్యాట్రిక్ సూపర్ హిట్ ఆల్బమ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో #FireStormIsComing, #PawanKalyan #OG ట్యాగ్ లు ట్రెండింగ్ గా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/