Last Updated:

Allu Arjun: తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ కొత్త సినిమా !

ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.‘పుష్ప ది రైజ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి చూపు ‘పుష్ప 2’పైనె పడింది.

Allu Arjun: తమిళ డైరెక్టర్  అట్లీతో అల్లు అర్జున్ కొత్త  సినిమా !

Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.‘పుష్ప ది రైజ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి చూపు ‘పుష్ప 2’పైనె పడింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.ఆయన మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలు చేస్తారనె ఆసక్తి అభిమానులతో పాటు టాలీవుడ్ పెద్దలు కూడా ఆరాలు తీస్తున్నట్టు తెలిసిన సమాచారం. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నారని గతంలో పలు వార్తలు, రుమార్లు వచ్చాయి.తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్తా తెగ హల్చల్ చేస్తుంది.అట్లీతో అల్లు అర్జున్ సినిమా నిజం కాబోతుందని తెలిసిన సమాచరం.

‘పుష్ష 2’సినిమా తరవాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసిన సమాచారం.ఇక్కడ ఇంకో షాక్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్‌కు ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ వారు అక్షరాల రూ.100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.ఇదే నిజమైతే రూ.100 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ తరువాత ఇప్పుడు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోతారు.అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయడం పక్కా.. కానీ…రెమ్యునరేషన్ రూ.100 కోట్ల విషయంపై స్పష్టత రావాలిసి ఉంది.

ఇవి కూడా చదవండి: