Home / Exams
NEET UG: నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.
TSPSC Group 2: రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్- 2 పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆగస్టు చివర్లో.. అనగా 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిని అధికారులు తెలిపారు.
Group-1 pattern: గ్రూప్ 1 ప్రాథమిక ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పరీక్ష ఎలా ఉంటుంది అనే విషయాన్ని TSPSC ప్రకటించింది. ఈ మేరకు సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనే వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులను కేటాయించారు. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్షను టీఎస్ […]
SI Constable: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు కీలక సూచన చేసింది. ముందుగా నిర్ణయించిన పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీలను మార్చినట్లు బోర్డు తెలిపింది. మార్చిన తేదీలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఎస్సై, ఏఎస్సై.. కానిస్టేబుల్, (SI Constable) కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో […]
పరీక్షలంటే కొందరికి ఎక్కడలేని భయం పుట్టుకుని లేని జబ్బులు తెచ్చుకుని ఆస్పిటల్ బాట పడతారు. కానీ ఓ మహిళ అంబులెన్సులోనే పరీక్షరాసి అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చి నిజంగానే సూపర్ మామ్ అనిపించుకుంది. అదీ ఆమెకు చదువుపట్ల ఉన్న ఆసక్తి.