Last Updated:

Today Panchangam : నేటి ( మార్చి 1) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మార్చి 1) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 1 ) బుధవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 10, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 08, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 01 మార్చి 2023

సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, ఈరోజు దశమి తిథి మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 2వ తేదీ 6:39 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం ఉదయం 9:52 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రీతి యోగం సాయంత్రం 5:02 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశిలోనే పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

 

సూర్యోదయం సమయం 01 మార్చి 2023 : ఉదయం 6:38 గంటలకు

సూర్యాస్తమయం సమయం 01 మార్చి 2023 : సాయంత్రం 6:18 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 5:02 గంటల నుంచి తెల్లవారుజామున 5:50 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:19 గంటల నుండి సాయంత్రం 6:42 గంటల వరకు

అమృత కాలం : అర్ధరాత్రి 1:32 గంటల నుండి ఉదయం 3:19 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 12:28 గంటల నుండి మధ్యాహ్నం 1:56 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 11:01 గంటల నుండి మధ్యాహ్నం 12:28 గంటల వరకు

యమగండం : ఉదయం 8:05 గంటల నుండి ఉదయం 9:33 గంటల వరకు

దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:05 గంటల నుంచి మధ్యాహ్నం 12:51 గంటల వరకు

వర్జ్యం : సాయంత్రం 7:16 గంటల నుంచి రాత్రి 9:03 గంటల వరకు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/