Last Updated:

Horoscope: నేటి రాశిఫలాలు( సోమవారం, 05 డిసెంబర్ 2022)

ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Horoscope: నేటి రాశిఫలాలు( సోమవారం, 05 డిసెంబర్ 2022)

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.

1.మేష రాశి
ఎవరేనా మిమ్మల్ని అప్ సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ, కోపాలేవీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. అనవసర ఆందోళనలు మరియు బెంగలు, మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాస్త అప్రమత్తత వహించండి. వ్యాపారాలు లాభదాయకంగా జరుగుతాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది.

2 .వృషభ రాశి
ఈ రోజు, మీకు అనేక టెన్షన్లు అభిప్రాయభేదాలు వస్తాయి. అవి, మిమ్మల్ని చిరాకు పరచి, అసౌకర్యానికి గురిచేస్తాయి. విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని మార్చుకుంటే మంచిది. మీ విలువైన కాలాన్ని మీపిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఈ రోజు మీకు ఆర్థికపరమైన విషయాలు కాస్త అస్తవ్యస్తంగా ఉంటాయి. ఈరోజు మీ వైహహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

3. మిథున రాశి
మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే, భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదలి పెట్టండి.
ఈ రోజు మీకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది.

4. కర్కాటక రాశి
మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం. అది, శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించివేస్తుందని మీరు గుర్తించాలి.
ఆర్థికపరిస్థితులు అస్తవ్యస్తంగా మారతాయి. ఉద్యోగులకు తగిన ప్రశంసలు అందుతాయి.

5. సింహ రాశి
మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం , యోగా చెయ్యడం చెప్పదగిన సూచన. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

6. కన్యా రాశి
మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ నుంచి చేజారిపోకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీరు మీ సంతానం నుంచి ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి
అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి
ఈరోజు మీ కుటుంబసభ్యులని బయటకు తీసుకువెళతారు. వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు మీకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

9. ధనస్సు రాశి
గ్రహచలనం రీత్యా, మీకుగల ఆకాంక్ష, కోరిక, భయం వలన కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరియైన సలహా అవసరం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ధృడంగా ఉంటుంది.

10. మకర రాశి
మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్లకూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

11. కుంభ రాశి
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారికోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. దాని వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి: