Last Updated:

Horoscope Today: నేటి రాశిఫలాలు

మీరు కష్ట పడి సంపాదించిన డబ్బును ఏ బిజినెస్లో పెడితే లాభాలు వస్తాయో బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీ భాగస్వామి మీ మాటలకు లొంగడం చాలా కష్టం. మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని మీరు కలుస్తారు. మీ వృత్తి కార్యక్రమానికి సంబంధించిన పనులు సజావుగా చేయడానికి మీరు ఎంతో చురుకుగా ఉండాలి.

Horoscope Today: నేటి రాశిఫలాలు

1. మేష రాశి

మీరు కష్ట పడి సంపాదించిన డబ్బును ఏ బిజినెస్లో పెడితే లాభాలు వస్తాయో బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీ భాగస్వామి మీ మాటలకు లొంగడం చాలా కష్టం. మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని మీరు కలుస్తారు. మీ వృత్తి కార్యక్రమానికి సంబంధించిన పనులు సజావుగా చేయడానికి మీరు ఎంతో చురుకుగా ఉండాలి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతం జరుగుతుంది .

2. వృషభ రాశి

మీరు డబ్బు విలువ బాగా తెలుసుకుంటారు. మీరు రోజు డబ్బును దాచిపెడితే అది మీకు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ ప్రియమైన వ్యక్తిని అంగీకారం అడుగుతారు. మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలను నేర్చుకోండి. మీరు ఈ రోజు మంచి నవలను చదువుతూ కాలం గడుపుతూ ఉంటారు. మీకు మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఉంటుంది. మీకు మీ వైవాహిక జీవితం మంచిగా మారనుంది.

3.మిథున రాశి

మీ మానసిక ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మంచి, చెడును మనసు ద్వారా కాకుండా అనుభవాల నుంచి కూడా తెలుసు కుంటారు. దాని వల్ల మీ జీవితంలోని సమస్యలను పరిష్కరించగలరు. మీరు ఈరోజు రాత్రి లోపు మంచి ఆర్ధికలాభాలను పొందుతారు. ఎందుకంటే మీరుఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది . ముఖ్యంలేని పనులు,అవసరంలేని పనులు మీరు మళ్లీమళ్లీ చేయుట వలన మీరు మీ సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు, లేదా మీ పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడతారు.

4. కర్కాటక రాశి

మీ స్నేహితులతో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది . డ్రైవింగ్ చేసేటప్పుడు, కొన్ని జాగ్రత్తలు తీసుకొండి. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మీరు ఇతరులతో ఎక్కువ మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. అప్పట్లో మీరు ఎంత అమాయకంగా ఉన్నారో అవి అన్ని మీరు ఈ రోజు గుర్తు తెచ్చుకుంటారు.

5. సింహ రాశి

వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలని మీ పాతస్నేహితుడు నుంచి సలహాలను తీసుకుంటారు. మీరు వారియొక్క సలహాలను కరెక్టుగా పాటిస్తే మీకు అదృష్టము మీ వెంటే నడిచి వస్తుంది. మీ ప్రియురాలి ప్రవర్తన వల్ల మీ మూడ్ డిస్టర్బ్ అవ్వుతుంది. ఈ రోజు మీరు సెమినార్లు నుంచి నేర్చుకుంటారు. అవి మీరు ఎదగడానికి క్రొత్త మార్గాలను చూపిస్తాయి. ఈ రోజు మీరు బంధాలయొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైంతవరకు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ మీ కంట్రోల్ నుంచి తప్పే అవకాశం ఉంది.

6. కన్యా రాశి

మీ చిన్నతనాల జ్ఞాపకాలను మీరు గుర్తు చేసుకుంటారు. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళనకు గురి అవుతారు. మీరు డబ్బుని ఇతరదేశా స్థలాల మీద మీరు పెట్టుబడి పెట్టివుంటే అవి ఈ రోజు మీకు అమ్ముడుపోతాయి. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా మీరు ప్రభావితం చెయ్యగలుగుతారు. మీ పనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండటం మంచిది. మీ పనిలో మీరు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితంలో చిన్న కొట్లాటలు జరుగుతాయి. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా చక్కగా, పవిత్రంగా సాగితుంది.

7. తులా రాశి

మీ ఆరోగ్యం గురించి మీరు అసలు ఆందోళన పడకండి. దానివలన మీరు మరింత అనారోగ్యానికి గురి గురి అవుతారు. మీ కరకు ప్రవర్తన వల్ల మీ పిల్లలకు కోపం వస్తుంది. మీ కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే, అదే మీ మధ్యన అవరోదాన్ని సృష్టిస్తుంది. ఏ విషయం గురించి మీరు ఆందోళన పడకండి. ఈ రాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు మీరు నష్టాలను చూస్తారు. అయినప్పటికీ మీరు పడాలిసిన అవసరం లేదు. వైవాహిక జీవితంలో వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరూ సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య ఎప్పుడూ కూడా మండుతూనే ఉంటాడు.

8. వృశ్చిక రాశి

మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, ఖర్చు చేసినా తరువాత మీరు వాటి గురించి బాధ పడుతుంటారు. సీనియర్లు పూర్తి సహకారం మీకు అందించడంతో ఆఫీసులో మీ పని త్వరగా చేస్తారు. మీరు మీయొక్క ఖాళిసమయాన్ని మీ కుటుంబసభ్యులతో మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించండి. మీరు ఏ కారణం లేకుండా ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగుదుతుంది. మీరు వాటికి పడిపోవడం ఖాయం.

9. ధనుస్సు రాశి

ఈరోజు మీ దయా స్వభావం వల్ల ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది . వ్యాపారస్తులు నష్టాలు చూస్తారు. అది మాత్రమే కాకుండా మీరు మీవ్యాపార అభివృద్ధి కొరకు మీరు ధనాన్ని కూడా ఖర్చుచేస్తారు. పరిస్థితి అదుపులో పెట్టడానికి , ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు వారి సమస్య గురించి ఒకసారి వినండీ. మీకు బాగా ఇష్టమైన వారినుండి మీకు ఈ రోజు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వల్ల మీరు చాలా ఆనందపడతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని గడిపి వారినిబ యటకు తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ వారియొక్క అనారోగ్యము వల్ల మీ భాగస్వామిని ఎక్కడికి తీసుకెళ్ల లేరు.

10. మకర రాశి

బయటి కార్యక్రమాలు వల్ల ఈరోజు మీకు బాగా అలసటను, వత్తిడినీ కలిగిస్తాయి. అనవసరంగా ఖర్చులు పెట్టటం మీరు తగ్గిస్తే మీడబ్బు మీకె పనికి వస్తుంది. అనవసర ఖర్చులు పెట్టకూడదని, ఈ రోజు మీకు ఈ విషయము బాగా అర్ధం అవుతుంది. చిన్నపాటి అవరోధాలతో, ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును , గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ఉంటారు.

11. కుంభ రాశి

ఈరోజు మీరు హుషారుగా, శక్తి వంతంగా ఉంటారు. ఈ రోజు ప్రారంభం మీకు చాలా అనుకూలంగాఉంటుంది .కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయాలిసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. మీ కుటుంబం సభ్యులతోగల విభేదాలను తొలగిపోయి , మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ ప్రేమ వ్యవహారాలలో బలవంతపెట్టడం మానుకోండి. ఈ రోజు మీరు చాలా చురుకుగాను ఉంటారు. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయము కేటాయించకుండా అనవసరపనులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితం కంట్రోల్ తప్పి పోతుంది.

12. మీన రాశి

ఈ రోజు మీ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు అప్పులు చేసి తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురౌవుతాయి. పనిలో మీరు లీనమైపోతారు. మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ,ఇతరుల అవరాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు దేవతలగా మీకు కనిపిస్తుంది. దాని వల్ల మీ భాగస్వామి అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు.

ఇవి కూడా చదవండి: