Last Updated:

Daily Horoscope: నేడు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.. జూన్ 7వ తేదీ దినఫలాలు ఇలా

రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 7 వ తేదీ, బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Daily Horoscope: నేడు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.. జూన్ 7వ తేదీ దినఫలాలు ఇలా

Daily Horoscope: రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 7 వ తేదీ, బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

 

మేషం

మేషరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. సన్నిహితులు నుంచి శుభవార్తలు వింటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది. లక్ష్మీ దేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలు.

వృషభం

ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో వివాదాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది. ఆలోచనలు అంతగా కలిసిరావు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఆధ్యాత్మిక చింతన ఆశ్రయించడం మేలు.

మిథునం

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాల్లో కొంత మార్పు ఉండొచ్చు. విద్యార్థులకు శ్రమ ఉంటుంది. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు.

 

దైవారాధన మానొద్దు(Daily Horoscope)

కర్కాటకం

కర్కాటక రాశి వారికి అనుకున్న రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి. కుటుండంలో శుభకార్యాలు. సన్నిహితుల వల్ల మేలు. ముఖ్య విషయాల్లో మనస్సు చెప్పిన విధంగా నడుచుకుంటే సత్ఫలితాలు సాధిస్తారు. మీరు ఇంతకాలం పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది. గృహ, వాహనయోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలు ఉంటాయి.

సింహం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూడ. పనుల్లో విజయం లభిస్తుంది.

కన్య

ఈ రాశి వారు చేపట్టే పనుల్లో కొంత శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. స్వల్ప విభేదాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. రామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఆపదలు తొలగడంతో పాటు మేలు జరుగుతుంది.

అజాగ్రత్త పనికి రాదు(Daily Horoscope)

తుల

వ్యవహారాల్లో స్వల్ప ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. అంచనాలు తప్పుతాయి. ఆరోగ్య భంగం. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. నిరుద్యోగులకు నిరాశ. వృత్తి వ్యాపారాల్లో మార్పులు ఉంటాయి. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.

 

వృశ్చికం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివి తేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమచారం అందుకుంటారు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ ఉత్తమం.

 

ధనస్సు

వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం వల్ల మంచి ఫలితం.

విద్యార్థులకు మంచి కాలం(Daily Horoscope)

మకరం

శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టే పనుల్లో అలసట రాకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవాలు బాగా పనిచేస్తాయి. విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

 

కుంభం

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. పనులు మందగొడిగా సాగినా.. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం

పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల కలుస్తారు. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్థి వృద్ధి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.