Daily Horoscope : ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిది..?
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని తెలుస్తుంది. అలానే జనవరి 22 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని తెలుస్తుంది. అలానే జనవరి 22 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
ముఖ్యమైన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది.
ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
వృషభం..
నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది.
మిథునం..
ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు.
కొందరు మిత్రులు అండగా నిలబడి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. బాకీ వసూలు అవుతుంది.
పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం..
వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారు మంచి ఉద్యోగాల్లోకి మారటానికి అవకాశం ఉంది.
కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
సింహం..
ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది.
కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.
కన్య..
మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది.
ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలు ఉన్నాయి. సామాజిక రంగంలోని వారికి గౌరవ మర్యాద పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల..
పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు.
నిరుద్యోగులకు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
వృశ్చికం..
నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో చిన్నాచితకా సమస్యలున్నా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు.
ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది.
ఈ రాశుల వారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు (Daily Horoscope)..
ధనుస్సు..
ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి ఇది మంచి సమయం.
నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లలకు సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం..
ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది.
స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమలో ముందడుగు వేస్తారు.
కుంభం..
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
ఉద్యోగులకు దూరప్రాంతం నుంచి ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు.
మీనం..
ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
కుటుంబ సంబంధమైన ఒకటి రెండు ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి.
రాజకీయ నాయకులు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Constable Preliminary Exam: ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం.. అభ్యర్థులకు సూచనలివే
- Manik Rao Thackrey: కంటివెలుగుకు రూ.300 కోట్లు ఖర్చు.. ఒక్క కంటి ఆస్పత్రి అయినా కట్టారా?- మాణిక్ రావు థాక్రే
- BBC Documentary on PM Modi: బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిందా?