Last Updated:

Vikarabad Crime: సూట్ కేస్ లో బాలుడి మృతదేహం

వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.

Vikarabad Crime: సూట్ కేస్ లో బాలుడి మృతదేహం

Kodangal: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో దుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఎస్సీ హాస్టల్ ముందు ముళ్లపొదల్లో సూట్ కేసులో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గుప్తనిధుల కోసమే బాలుడిని బలి ఇచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

రాజా ఖాన్ (10) ను కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కొడంగల్ పోలీసులు. అయితగుప్త నిధుల కోసమే ఆ బాలున్ని బలి ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు స్థానికులు. దీంతో కొడంగల్ లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారంది. అటు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.