Home /Author M Rama Swamy
BRS Working President KTR : హైదరాబాద్ నగరంలోని కాలనీలు, బస్తీల్లో గులాబీ జెండా ఎగురవేసి, ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో శనివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. […]
Visakhapatnam Municipal Corporation : కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌పై నెలకొన్న పరిస్థితులకు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసం చేసుకుంది. రాజకీయ కీలక నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధీర ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. […]
Inter Exam Results : ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షలు ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ నెల 22న ఉదయం 11గంటలకు భట్టి విక్రమార్క ఫలితాలను రిలీజ్ చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు వెల్లడించింది. కార్యక్రమంలో ఇంటర్ […]
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
Rohith Vemula Act : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో కుల వివక్షను నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎంకు లేఖ రాశారు. తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో […]
CM Revanth Reddy : పండుగ నాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడగా, సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. విశాఖకు చెందిన హేమంత్ (22) అనే యువకుడు మార్చి 29న షిర్డీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారగా, కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేట్ […]
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. అమానవీయ మావోయిస్టు భావజాలం, గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ 9 మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. […]
Former CM and YSRCP chief YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. జగన్‌కు సంబంధించిన రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేస్తున్నట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు తీసుకున్నారు. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు పలు కంపెనీలకు లాభాలు కలిగించగా, వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్, బెంగుళూరులో ఉన్న ల్యాండ్స్ కొన్ని కంపెనీల్లో వాటాలు […]
TG EAPCET 2025 : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి మే 2 నుంచి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈఏపీసెట్ పరీక్షలు రోజూ రెండు దశల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 […]
Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామస్తులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లగా, యాద్గిర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ […]