Home /Author M Rama Swamy
Kangana Ranaut: హిమాచల్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఒక కేసులో ఎదురుదెబ్బ తగిలింది. నటిపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కేసు 2021లో జరిగిన ఘటనలకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతుంది. అదే సమయంలో కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది. ట్వీట్లో బతిండా జిల్లా బహదూర్గఢ్ జండియా గ్రామానికి చెందిన మహిందర్ కౌర్ […]
CM Revanth Reddy: అధికారంలోకి తీసుకురావడానికి కమ్యూనిస్టులు ఉపయోగపడతారో లేదో విశ్లేషించలేనని, కానీ అధికారంలో ఉన్నవారిని దింపేడానికి మాత్రం 100 శాతం పనికొస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తప్పు చేసేవారిని గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు అని కొనియాడారు. […]
Former Minister Harish Rao: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇది ఉమ్మడి ఏపీ కాదని, పొక్కలు కొట్టేందుకు అని లోకేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గోదావరిలో తెలంగాణ, ఏపీ వాటా ఎంతో సమాధానం చెప్పాలి.. గురువారం లోకేశ్ మాట్లాడుతూ.. మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయని మాట్లాడుతున్నారని తెలిపారు. సాగునీటి జలాల్లో లోకేశ్‌కు అవగాహనం లోపం ఉందని […]
Yadadri Thermal Power Station: నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్)లోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్-1ను మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ జాతికి అంకితం చేశారు. అంతకుముందు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన చేశారు. 55 ఎకరాల్లో రూ.970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. వనమహోత్సవంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం భూనిర్వాసితులతో […]
Draft Electoral Rolls for Bihar: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇటీవల ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను చేపట్టింది. ప్రక్రియ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. ప్రస్తుతానికి ముసాయిదా జాబితాలో చేర్చిన వివరాలు వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. ఓటర్లు ఈసీ వెబ్సైట్లో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మూడు […]
Radhika: ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. అప్పట్లో చాలా మూవీల్లో హీరోయిన్గా రాధిక నటించారు. రాధిక ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రాధిక శరత్‌కుమార్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. రాధికను ఈ నెల 28వ తేదీన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా.. వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు […]
Annadata Sukhibhava Scheme: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ముందడుగు వేసింది. ఈ సందర్భంగా గురువారం పథకం అమలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 2న పథకాన్ని అమలు చేసేందుకు కూటమి సర్కారు సన్నద్ధం అవుతోంది. అదేరోజు పీఎం కిసాన్ పథకం నిధులను కేంద్రం విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి […]
YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు భారీగా ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి జగన్ రెచ్చగొడుతూ తన వెనుకే రావాలని కాన్వాయ్ నుంచి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. […]
Election Commission of India: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజ్ సిద్ధమైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల స్థానాలు.. వారివారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంటాయని ఈసీ తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఈసీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి ఈసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబోయే […]
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది. పవిత్రమైన క్షేత్రంలో అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని తెలిపిందతి. కేవలం ఆధ్యాత్మిక […]