Home /Author M Rama Swamy
YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు భారీగా ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి జగన్ రెచ్చగొడుతూ తన వెనుకే రావాలని కాన్వాయ్ నుంచి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. […]
Election Commission of India: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజ్ సిద్ధమైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల స్థానాలు.. వారివారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంటాయని ఈసీ తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఈసీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి ఈసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబోయే […]
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది. పవిత్రమైన క్షేత్రంలో అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని తెలిపిందతి. కేవలం ఆధ్యాత్మిక […]
British actress and singer Cynthia Erivo: ఆరోగ్య బీమా, జీవిత బీమా ఈ రెండు పదాలు మనం నిత్యం వింటుంటాం. అయితే ఓ నటి తన నోటికి బీమా చేయించుకున్నారు. ఎంతో ఇష్టమైన తన నవ్వుకోసం రూ.16.5 కోట్లు ఖర్చుపెట్టారు. ఆమె బ్రిటిష్ నటి, సింగర్ సింథియా ఎరివో. మీడియా కథనాల ప్రకారం.. మౌత్‌వాష్ బ్రాండ్ లిస్టెరిన్ నిర్వహిస్తోన్న ‘వాష్ యువర్ మౌత్’ కార్యక్రమానికి ఆమె ప్రచారకర్తగా ఉన్నారు. నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. […]
Telangana High Court: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. కె.బాబూరావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సిగాచీ పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల పేలుడు సంభవించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనలో 54 మంది మృతిచెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుదా నాగరాజు హైకోర్టుకు తెలిపారు. […]
Union Cabinet: రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. మంత్రివర్గ భేటీ తర్వాత కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి పథకానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలంలో ఎన్సీడీసీ […]
TamilNadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. రామచంద్రన్ ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్‌ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్డీయే కూటమితో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. 2026 […]
Senior Congress leader Shashi Tharoor: ఇండియా దిగుమతులపై 25% సుంకంతోపాటు అదనంగా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటన సరికాదన్నారు. గురువారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత వాణిజ్యానికి అమెరికా అతి పెద్ద మార్కెట్ అన్నారు. భారత్ ఎగుమతులు 87-90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయన్నారు. రష్యా నుంచి దిగుమతులు […]
Telangana Speaker Prasad Kumar: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు 3 నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయానికి వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తానని తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారని గుర్తుచేశారు. వాటిని కూడా […]
BRS Working President KTR: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం నిర్ణయాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. దేశం ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు […]