Home /Author Guruvendhar Reddy
Road Accident in Anantapur District: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా, దవాఖానకు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పనికి పోయి.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి […]
MLAs Complaint against AU Ex VC Prasad Reddy to Nara Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ హయాంలో ఏయూ వీసీగా పని చేశారు. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల […]
MLC Kavitha Fires on Congress Government: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల్లో ఇప్పటి వరకు […]
MLC Venkata Ramana Resign To YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందిన నాటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకట రమణ తాజాగా తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ నేపథ్యం బీసీ వర్గానికి చెందిన జయమంగళ వెంకట రమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా […]
AP BJP Chief Purandeswari: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే మరాఠిలు పట్టం కట్టారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఆమె హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీయే కూటమి సుపరిపాలన అందించిందన్నారు. అవినీతి రహిత పాలన చేసిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఔన్యత్యాన్ని పెంచారని గుర్తుచేశారు. అభివృద్ధికి పెద్దపీట […]
Priyanka Gandhi Win in Wayanad By-Election: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబం కొత్త ఆప్షన్లు వెతుకున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లకు ఆవల మరో సేఫ్ సీటు కోసం వెతికారు. అప్పట్లో రాయ్ బరేలీ స్థానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వాయనాడ్ […]
MP Bandi Sanjay Press Meet In Karimnagar: తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే […]
Australia vs India 1st Test Border Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(41) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే కీపర్‌కు […]
Deputy CM Pawan Kalyan in AP Assembly Meetings: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500కోట్లతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నిధులతో 30వేల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. […]
Kenya cancels deals with Adani: కెన్యా ప్రభుత్వం గౌతమ్ ఆదానీకి షాక్ ఇచ్చింది. భారతీయ బిలియనీర్ గౌతమ్ ఆదానీకి ఇవ్వనున్న రెండు ప్రధాన ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. దీంతో పాటు విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు. ఇటీవల కొన్ని ప్రాజెక్టుల విషయంలో గౌతమ్ అదానీ లంచం తీసుకున్న ఆరోపణలు వస్తుండగా.. అతనిపై […]