Chandrababu Housewarming: అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు గృహప్రవేశం..
AP CM Chandrababu Naidu’s Housewarming Ceremony: ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఇవాళ తెల్లవారుజాము 4:30 గంటలకు గృహప్రవేశ పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఎం కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలువనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్నారు. దీంతో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. శుభ కార్యక్రమానికి వచ్చేవారికి పసందైన పలు రకాల విందు వంటకాలు సిద్ధం చేశారు. కుప్పంలోని నూతన ఇంటి గృహప్రవేశం నేపథ్యంలో చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కుప్పం చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు సీఎం మాత్రమే కాదు..
పసందైన వంటకాలు..
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పరిధిలోని శివపురం వద్ద రెండెకరాల స్థలంలో చంద్రబాబు కొత్త ఇళ్లను నిర్మించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం కుప్పం చేరుకుని పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం రాత్రి 8 గంటలకు కుప్పం చేరుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత కుప్పం వచ్చారు.
గృహప్రవేశ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన ప్రత్యేకమైన షెడ్లను నిర్మించారు. శనివారం రాత్రి ఇంటి వద్ద బంధుమిత్రులు, వీఐపీలకు భోజనాలు చేసి వడ్డించారు. ఇవాళ మధ్యాహ్నం వేలసంఖ్యలో ప్రజలు భోజనాలు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి వంట ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నారా భువనేశ్వరి దగ్గరుండి వంటకాలను సిద్ధం చేయించారు. 25 వేలమంది సాధారణ ప్రజలు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేశారు.
అందరికీ ఆహ్వానాలు..
చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానాలు పలికారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ ఆహ్వాన పత్రికలు పెట్టడంతోపాటు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో వెళ్లి పత్రికలను పంచారు. కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.