Last Updated:

Tirumala Tirupati Devasthanam : అలిపిరి కాలి నడక మార్గంలో మళ్ళీ కనిపించిన చిరుత, ఎలుగుబంటి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు మరోసారి భయాందోళన కలిగించే వార్త కలకలం సృష్టిస్తుంది. అక్టోబర్‌ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించడంతో భక్తులు గుంపులుగా

Tirumala Tirupati Devasthanam : అలిపిరి కాలి నడక మార్గంలో మళ్ళీ కనిపించిన చిరుత, ఎలుగుబంటి

Tirumala Tirupati Devasthanam : తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు మరోసారి భయాందోళన కలిగించే వార్త కలకలం సృష్టిస్తుంది. అక్టోబర్‌ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించడంతో భక్తులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరించారు.

గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

గత ఆగస్టులో అలిపిరి తీర్థయాత్ర మార్గంలో రాత్రిపూట ఆరేళ్ల బాలికను పులి చంపింది. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఫారెస్ట్‌ గార్డుతో పాటు గుంపులుగా మాత్రమే భక్తులను తిరుపతి నడక మార్గంలోకి అనుమతించారు. ఆరేళ్ల బాలికను పులి చంపిన తర్వాత తిరుపతిలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనుల్లో ఆరు పులులు, ఎలుగుబంటి చిక్కుకున్నాయి. యాత్రికులు హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా తప్ప పర్వతం ఎక్కవద్దని అధికారులు హెచ్చరించారు.