SI Arrest: హైదరాబాద్ ..డ్రగ్స్ దాచిపెట్టి అమ్మడానికి ప్రయత్నించిన ఎస్సై అరెస్ట్
చట్టానికి ప్రతినిధి అయిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ చట్టం చేతులకే దొరికిపోయాడు. నేరగాళ్ళని పట్టుకోవాల్సి ఎస్సై తానే నేరగాడిగా మారాడు. డ్రగ్స్‌కి కళ్ళెం వేయాల్సిన ఆ ఎస్సై ఆ మత్తు పదార్థాలే అమ్ముకోవాలని ప్లాన్ చేసి సైబరాబాద్ పోలీసులకి చిక్కాడు.
SI Arrest: చట్టానికి ప్రతినిధి అయిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ చట్టం చేతులకే దొరికిపోయాడు. నేరగాళ్ళని పట్టుకోవాల్సి ఎస్సై తానే నేరగాడిగా మారాడు. డ్రగ్స్‌కి కళ్ళెం వేయాల్సిన ఆ ఎస్సై ఆ మత్తు పదార్థాలే అమ్ముకోవాలని ప్లాన్ చేసి సైబరాబాద్ పోలీసులకి చిక్కాడు. డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌ను హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే ఎస్సై రాజేందర్ ఏసీబీ కేసులో చిక్కి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకుని ఉద్యోగంలో చేరాడు. మళ్ళీ ఈ తప్పుడు పని చేసి అరెస్టయ్యాడు.
సీజ్ చేసిన డ్రగ్స్ దాచిపెట్టి..(SI Arrest)
ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ టీమ్‌లో పని చేస్తున్న రాజేందర్.. సీజ్ చేసిన డ్రగ్స్‌లో కొంత భాగాన్ని తన ఇంట్లోనే దాచి పెట్టారు. సీజ్ చేసిన డ్రగ్స్‌ని కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. డ్రగ్స్ తక్కువగా కనిపించడంతో రాజేందర్‌ని పోలీసులు ప్రశ్నించారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్‌ని ఆ తరువాత అమ్ముకోవాలని రాజేందర్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్సై రాజేందర్‌ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఇంట్లో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.