Amaravati Land Scam: అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో ఐదుగురు అరెస్ట్
రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఏసీ సీఐడి అయిదుగురిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా పెదపాలెంకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడి 169.27 ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించింది.
Amaravati: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఏసీ సీఐడి అయిదుగురిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా పెదపాలెంకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడి 169.27 ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణ పైన సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
సొంత బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఏపీ సీఆర్డీయే చట్టం 2014 కింద ఏర్పాటైన వివిధ కమిటీలకు నేతృత్వం వహించిన నారాయణ, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె.పి.వి.అంజన్‌కుమార్‌తో కలిసి కుమ్మక్కయ్యారని సీఐడీ అభియోగాల్లో నమోదు చేసింది. కేవలం పట్టా భూములను మాత్రమే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నట్టుగా అధికారుల ద్వారా నారయణ పావులు కదిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, కిర్లంపూడి లేఅవుట్‌కు చెందిన చిక్కళ్ల విజయ సారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు..