Last Updated:

Maha Kumbha Mela: కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం

Maha Kumbha Mela: కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం

Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

మరోవైపు బీహార్‌లోని పాట్నా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. పట్నా మసౌర్హి రోడ్డులోని సౌరా బ్రిడ్జి సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు చనిపోయారు. అలాగే ప్రయాగ్ రాజ్ నుంచి తిరిగి వస్తున్న జీపు అతివేగంతో అదుపు తప్పి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు సమాచారం.