ఈ రోజుల్లో పండ్లను జ్యూసులకా చేసుకుని తాగే అలవాటు బాగా పెరిగింది

పండ్లను తినే వీలున్నా చాలా మంది వాటిని జ్యూస్ లాగా చేసుకుని తాగుతున్నారు

అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం జ్యూస్ కంటే పండ్లే ఎక్కువ ఆరోగ్యకరం అంటున్నారు

జ్యూస్ లో పోషకాలు విటమిన్స్ ఉంటాయి కానీ ఫైబర్ మిస్ అవుతుంది

ఫైబర్ అనేది పీచు పదార్థం జ్యూస్ ని ఫిల్టర్ చేసినప్పుడు ఇది ఫిల్టర్ అవ్వదు. అందువల్ల జ్యూస్ లో ఫైబర్ మిస్సవ్వగలదు

ఫైబర్ అనేది పొట్ట నిండిన ఫీల్ కలిగిస్తుంది. ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. పండ్లలో షుగర్ జీర్ణం అయ్యేందుకు ఫైబర్ చాలా అవసరం

పండ్ల జ్యూస్ వల్ల ఎక్కువ ఆరోగ్యం కలుగుతుందనేందుకు సైంటిఫిక్ గా ఆధారాలు ఏమీ లేవు

జ్యూస్ తాగేవారు అందులో పంచదార కలుపుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంది

మొత్తంగా పండ్లనే తినాలి.. మరీ వీలు కాకపోతేనే జ్యూస్ చేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం