ఉత్తరాఖండ్‌లోని మనా గ్రామం దేశానికి మొదటి గ్రామంగా పరిగణించబడుతుంది.

ఈ గ్రామం ఇదివరకు దేశానికి చివరి గ్రామంగా ఉంది

మనా గ్రామంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలేమిటో ఇప్పుడు చూద్దాం

నీలకంఠ శిఖారానికే ‘గర్హ్వాల్ రాణి’ అని కూడా పేరు. ఈ శిఖరం నుంచి మీరు బద్రీనాథ్ ధామ్ చూడవచ్చు

అలకనంద నది ఒడ్డున ఉన్న మాతా మూర్తి ఆలయం అతి పురాతన దేవాలయం. శ్రీమహావిష్ణువు అవతారంగా పరిగణించబడే నరనారాయణుల మాతృ‌మూర్తికి ఈ ఆలయం అంకితం చేయబడింది.

అలాగే ఈ మన గ్రామానికి సమీపంలో వ్యాసుడు ధ్యానం చేసిన గుహలు కూడా ఉన్నాయి ఈ గుహలు ఎంతో ప్రత్యేకం

వసుధార అందమైన జలపాతం చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. జలపాతం నుంచి జారుతున్న నీటి బిందువులు ముత్యాల్లా కనిపిస్తున్నాయి

 మనా గ్రామంలోని తప్ట్ కుండ్ కి ఔషధ ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశాన్నే అగ్నిదేవుని నివాసంగా పరిగనిస్తూ ఇందులో ఉండే నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు.

ఈ గ్రామానికి సమీపంలో భీమ్ కుంఢ్ కూడా ఉంటుంది. ఇక్కడి నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు నీలం రంగులో కనిపిస్తుండడానికి రీజన్ ఏంటనేది ఇప్పటికీ అంతపట్టని రహస్యం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం