ఐ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఆప్టిక్ నరాల ముందు భాగంలోని కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల సంభవిస్తుంది
దృష్టిలో అస్పష్టత, చీకటి, నీడలు లాంటి ఆకస్మిక మార్పులకు దారితీయ్యడం దీని సంకేతాలు. ఇది తరచుగా ఒక కంటిలో మాత్రమే కనిపిస్తుంది.
వయస్సు 50 లేదా అంతకంటే ఎక్కువ, అధిక రక్తపోటు కలిగి ఉండటం, డయాబెటిస్, గ్లాకోమా ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు ఈ ఐ స్ట్రోక్‌కు రిస్క్ జోన్‌లో ఉన్నారు.
తరచుగా కంటికి మసాజ్ చేయడం ద్వారా కంటిలో రక్తం గడ్డకట్టడాన్ని.. కంటి స్ట్రోక్‌ను నాలుగు గంటలలోపు నిర్ధారణ చేసే వీలుంటుంది.
తగినంత ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మీ రక్తంలో చక్కెర, ఒత్తిడి స్థాయిలను చెక్ చేయడం చేయాలి. స్మోకింగ్ మానేయాలి, అధికంగా మద్యం సేవించడం తగ్గించడం వల్ల ఈ స్ట్రోక్ ను నివారించవచ్చు