ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా. 4 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మగా.. ఈ చిత్రం 11.3 కోట్లు కలెక్ట్ చేసింది.
ఎన్టీఆర్ ను స్టార్ ను చేసిన సినిమా ఇది. సింహాద్రి సినిమాను 13 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 26 కోట్లు కలెక్ట్ చేసింది.
హీరో నితిన్ హీరోగా నటించిన ‘సై’ సినిమా రాజమౌళికి మూడో సినిమా. ఈ సినిమాను 7 కోట్లకు విక్రయించారు. అయితే, ఈ సినిమా 9.5 కోట్లను వసూలు చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని 13 కోట్లకు అమ్మారు. బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి చిత్రం మొత్తం 22 కోట్లు కలెక్ట్ చేసింది.
రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా రాజమౌళికి ఐదో సినిమా. ఈ చిత్రాన్ని 11 కోట్లతో నిర్మించి.. 14 కోట్లకు విక్రయించారు. ఈ చిత్రం 14.50 కోట్లు కలెక్ట్ చేసింది.
ఎన్టీఆర్ ‘యమదొంగ’ సినిమాను 15 కోట్లు నిర్మించి 18 కోట్లకు అమ్మారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 38 కోట్లను రాబట్టింది.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ను 44 కోట్లతో నిర్మించారు. 48 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 59 కోట్లను రాబట్టింది.
సునీల్ హీరోగా తెరకెక్కించిన మర్యాదరామన్న సినిమా రాజమౌళికి ఏడో సినిమా. 14 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 20 కోట్లకు అమ్మారు. ఈ సినిమా 29 కోట్లను కలెక్ట్ చేసింది.
ఈగ సినిమాను 26 కోట్లతో నిర్మించగా 32 కోట్లకు విక్రయించారు. ఈ సినిమా 46 కోట్లను వసూలు చేసింది.
బాహుబలి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మించారు. ఇక 191 కోట్లకు ఈ సినిమాని అమ్మారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 302 కోట్లను కలెక్ట్ చేసింది.
బాహుబలి కంక్లూజన్ చిత్రాన్ని రూ.250 కోట్లతో నిర్మించారు. అయితే, ఈ చిత్రం 1617 కోట్లను కలెక్ట్ చేసింది.
ఈ సినిమాని రూ.350 కోట్లతో నిర్మించారు. కాగా సుమారు1500 కోట్లు కలెక్ట్ చేసింది.