చరిత్రలో నిలిచిపోయే రీతిలో.. దేశంలో ఎక్కడా లేనట్టుగా నిర్మితమైంది తెలంగాణ నూతన సచివాలయం.
తెలంగాణ నూతన సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, అంటే ఇది ఇది కుతుబ్‌మినార్(239 అడుగులు) కంటే 26 అడుగులు ఎత్తు ఎక్కువ.
సచివాలయం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా.. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను నిర్మించారు.
సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు, అక్కడి ఉద్యోగుల పిల్లలకు క్రెచ్, ఆరోగ్య కేంద్రం, బ్యాంకు, ఏటీఎం వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి