వేసవిలో తగినంత నీరు తాగక పోతే ఏమవుతుందో తెలుసా

వేసవి కాలంలో తనగినంత వాటర్ తాగపోతే డీహైడ్రేషన్ వడదెబ్బ బారిన పడుతారు.

రక్తంలో నీటి శాతం తగ్గడంతో అలసట, కళ్లు, చేతులు, అరికాళ్లు మంటగా ఉంటాయి

శరీరానికి సరిపడా నీరు లేకపోతే మొదటగా మన పెదాలు ఎండిపోతాయి తర్వాత నాలుక పొడిబారిపోవడం చర్మం పాలిపోవడం అవుతుంది.

మాత్రపిండాలు ఇన్ ఫెక్షన్ బారిన పడుతాయి.

నీటిశాతం తగ్గిపోతే మూత్రం రంగు మారిపోతుంది.

అరికాళ్లలో పగుళ్లు ఏర్పడుతాయి. ముక్కు నుంచి రక్తం కారుతుంది. చెవినొప్పి కూడా రావొచ్చు.

దీనికి పరిష్కారం నీరు తగినంత తాగడమే. పరిగడుపున రెండు గ్లాసుల నీరు తాగితే శరీరంలోని చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.

ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం 10 నుంచి 14 గ్లాసుల నీటిని తాగాలి. వీలయితే నిమ్మరసం, మజ్జిగ, పండ్లు తీసుకోవాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం