వేసవి కాలం వచ్చిందంటే చాలు ముందుగా గుర్తొచ్చేది మామిడిపండ్లు మాత్రమే

రాను రాను వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోనూ ఆల్ఫోన్జో రకం మామిడి పండ్ల డిమాండ్ బాగా ఉంటుంది.

ఆల్ఫోన్జో రకం డజను పండ్లు కొనాలంటే రూ. 800 నుంచి రూ. 1300 వరకు ఉంటుంది

దీంతో పుణెకు చెందిన గౌరవ్ సనాస్ అనే వ్యాపారి అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు.

మామిడి పండ్లను ఈఎంఐలో అమ్మకం పెట్టాడు.

మామిడి పండ్లను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. 

అంతేకాకుండా కనీసం రూ. 5 వేలు అంతకంటే ఎక్కువ ఖరీదు చేయాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ కోసం సదురు వ్యాపారి పేటీఎం స్వైప్ మిషన్ ను వినియోగిస్తున్నారు. కస్టమర్ మామిడి పండ్లను కొన్న తర్వాత క్రెడిట్ కార్డుతో ఈ మిషన్ లో స్వైప్ చేసి బిల్లు తీసుకుంటున్నారు.

అప్పుడు మిషన్ లో ఈఎంఐ ఆఫ్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే బిల్లును 3,6,12 నెలల్లో వాయిదాల్లో చెల్లించవచ్చని ఆయన తెలిపారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం