ఈ పువ్వుని చైనా సాంప్రదాయ వైద్యంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు.
తామరపువ్వులోని చల్లదనం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. దీనితో పాటు, ఇది శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
లోటస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్థాయి.శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగి ఉంటే.. తామర నూనెతో మసాజ్ చేయవచ్చు.
తామర పువ్వుతో తయారుచేసిన నూనెను రోజూ తలకు మర్దన చేయండి. దీనివలన జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా పెరుగుతుంది.
రోజూ తామరపువ్వుని ఉపయోగిస్తుంటే.. ఫీల్-గుడ్ హార్మోన్లు కూడా పెరుగుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.