కాకరకాయ చేదని చాలా మంది తినరు. కానీ దీనిలో పోషకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు.
కాకరకాయ తినడం వల్ల శ్వాస సమస్యల నుంచి బయటపడవచ్చు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి అనేక సమస్యల నుంచి కాకరకాయ మిమ్మల్ని కాపాడుతుంది
రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరకాయ కీలకంగా వ్యవహరిస్తుంది. దీని ద్వారా రక్తంలోని విషపదార్థాలు బయటకు పంపబడతాయి
ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కాకరకాయ దోహదపడుతుంది. కాకర రసం తాగితే చర్మం ఎక్స్ ఫోలియేట్ అవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కాకరకాయ దివ్యోషధంగా పనిచేస్తుంది.
కాకరకాయ తినడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులోని విటమిన్ల వల్ల కంటిసంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి
జీర్ణ సమస్యలు, అజీర్ణం కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ ఔషధంగా పనిచేస్తుంది.