వాము చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
దగ్గు, జలుబును తగ్గేందుకు కూడా వాము ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. శ్లేష్మాన్ని సులభంగా తొలగించడానికి, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగించడానికి వాము సహాయపడుతుంది.
వాము గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, అసౌకర్యం వంటి దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
వాములో నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మూసుకుపోయిన నాసికా మార్గాలను తెరవడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.