ఇంట్లో కానీ ఇంటి ఆవరణలో కానీ పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు, పాలు కారే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు.
చింత చెట్టు మీ ఇంటికి దగ్గరగా ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈ చెట్లను ఇంట్లో అస్సలు నాటకూడదు.
రావి చెట్టును దైవంగా ఆరాధిస్తారు. వీటిని ఎక్కువగా దేవాలయం చుట్టూ పెంచుతారు. కానీ ఈ చెట్టును ఇంట్లో పెంచకూడదు.
ఈత చెట్టును పెంచుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈత కాయలు పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
రేగు చెట్టునుండి వచ్చే రేగుపండ్లను తింటారు. కానీ ఈ చెట్టు ఇంట్లో పెంచకూడదు. ఈ చెట్టు ముళ్లతో కూడి ఉంటుంది. ముళ్ళ కారణంగా కొన్ని సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు.
జిల్లెడు చెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి ఆవరణంలో పెంచకూడదు. జిల్లెడు చెట్టు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు నాశనమవుతుంది అని పెద్దలు చెబుతుంటారు.
మర్రి చెట్టును ఇంటి ఆవరణంలో పెంచరాదు. ఎందుకంటే ఇవి పెద్ద ఊడలను కలిగి ఉంటుంది. ఈ చెట్టును పెంచడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.
పత్తి చెట్టును కూడా ఇంట్లో పెంచుకోకూడదు. వాస్తు ప్రకారం పత్తి చెట్టు ఇంట్లో అశుభాలకు కారణమవుతుంది