140 ఏళ్ల యాషెస్ సిరీస్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్ lతర్వాత జాక్ హబ్స్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా మారాడు.

ఇంగ్లండుకు చెందిన జాక్ హాబ్స్ మొత్తం 41 మ్యాచ్‌లు ఆడి 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో సహా 3636 పరుగులు సాధించాడు.

యాషెస్‌ సిరస్‌లో అత్యధిక శతకాలు, రన్స్ చేసిన లిస్టులో 2వ స్థానంలో జాక్ హబ్స్ ఉన్నారు.

జాక్ హాబ్స్ అంతర్జాతీయ క్రికెట్ కంటే దేశీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించాడు. 

రైట్ హ్యాండ్ ఓపెనర్ జాక్ హాబ్స్ 834 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 50.70 సగటుతో 61760 పరుగులు చేశాడు.

ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 199 సెంచరీలు, 273 అర్ధ సెంచరీలు వచ్చాయి. హాబ్స్ అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 316 నాటౌట్‌గా నిలిచింది.

హాబ్స్ 1905 సంవత్సరంలో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను షురూ చేశాడు.

29 సంవత్సరాల తర్వాత 1934లో ముగింపు పలికాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చే సమయానికి అతని వయసు 52 ఏళ్లు కావడం విశేషం.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం