Home / వీడియోలు
యూనివర్సల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే విక్రమ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని తమకు న్యాయం చెయ్యాలంటూ సార్ సీఎం సార్ అంటూ జగన్ కాన్వాయ్ ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతులను పక్కకు తరలించేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ హీట్ మొదలయ్యింది. ఓడిన చోటే గెలుపు వెతుక్కోవాలంటూ టీడీపీ.. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
బాల నటిగా అంజి, దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఆకట్టుకున్న భామ నిత్యా శెట్టి. ఇప్పుడు హీరోయిన్ గా మారి నువ్వు తోపురా అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత ఓ పిట్ట కథలోనూ నటించింది. అయితే ఇవేవీ ఆమెకు గొప్పగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు. మరో వైపు డిజిటల్ మాధ్యమంలో సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ మేరకు
గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రతిరాష్ట్రంలోనూ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ పాలనను సులభతరం చేస్తూ వివిధ శాఖలు ఏర్పడ్డాయి. అందులో వ్యవసాయ శాఖ ఒకటి. ఈ శాఖను వ్యవసాయశాఖ మంత్రి చూసుకుంటారు. అయితే మరి దేవతల కాలంలో ప్రజాపాలన ఎలా సాగేది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి ఎవరి మీకు తెలుసా..
పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం.