Last Updated:

Google: గూగుల్ మిస్టేక్.. సెక్యూరిటీ ఇంజనీర్ అక్కౌంట్ లోకి రూ.2 కోట్లు బదిలీ

సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయిన సామ్ కర్రీ అనే వ్యక్తి తనకు గూగుల్ ద్వారా దాదాపు $250,000 (రూ. 2 కోట్లకు దగ్గరగా) రహస్యంగా చెల్లించబడిందని, అయితే చాలా వారాలుగా భారీ డిపాజిట్‌కి సంబంధించి ఎలాంటి వివరణను కనుగొనలేకపోయానని చెప్పాడు.

Google: గూగుల్ మిస్టేక్.. సెక్యూరిటీ ఇంజనీర్ అక్కౌంట్ లోకి రూ.2 కోట్లు బదిలీ

Google: సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయిన సామ్ కర్రీ అనే వ్యక్తి తనకు గూగుల్ ద్వారా దాదాపు $250,000 (రూ. 2 కోట్లకు దగ్గరగా) రహస్యంగా చెల్లించబడిందని, అయితే చాలా వారాలుగా భారీ డిపాజిట్‌కి సంబంధించి ఎలాంటి వివరణను కనుగొనలేకపోయానని చెప్పాడు.

గూగుల్ యాదృచ్ఛికంగా నాకు ఈ డబ్బు పంపి 3 వారాలకు పైగా గడిచింది . దీనిపై నాకు ఇంకా ఏమీ తెలియలేదు. మేము @Googleని సంప్రదించడానికి ఏదైనా మార్గం ఉందా? అంటూ ట్వీట్ చేశాడు. యుగా ల్యాబ్స్‌లోని స్టాఫ్ సెక్యూరిటీ ఇంజనీర్, కర్రీ మాట్లాడుతూ, అతను కొన్నిసార్లు గూగుల్ వంటి కంపెనీల కోసం పనిచేస్తూ ఉంటాడు.టెక్ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని కనుగొనడంలో సహాయం చేయడానికి వ్యక్తులకు డబ్బు చెల్లిస్తాయి. కానీ అటువంటి చెల్లింపు ఏమీ జరగలేదు.

దీనితో గూగుల్ అనుకోకుండా తనకు రూ.2 కోట్లు బదిలీ చేసిందని కన్ ఫర్మ్ అయింది. మానవ తప్పిదాల ఫలితంగా మా బృందం ఇటీవల ఆ చెల్లింపు చేసిందని అని గూగుల్ ప్రతినిధి. ఇది త్వరగా మాకు తెలియజేయబడింది. దానిని సరిచేయడానికి మేము కృషి చేస్తున్నామని అన్నారు. మరోవైపు కర్రీ కూడ గూగుల్ నన్ను సంప్రదించింది. దానిని తిరిగి చెల్లించడానికి నేను ఈ రోజు బ్యాంకుకు వెళ్లబోతున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి: