Home / తెలంగాణ
12km Traffic Jam on Srisailam Highway: శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్, వరుస సెలవులు, శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు శ్రీశైలం వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్- శ్రీశైలం హైవేపై సుమారు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. శ్రీశైలం వెళ్లేదారిలో దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దాదాపు […]
Telangana PCC President Mahesh Kumar Goud comments on MLC Kavitha: కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని గ అన్నారు. కీలకమైన నిర్ణయాలను అభినందించేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మనసు రావడం లేదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి […]
Ganja batch arrested by Hyderabad Police: గంజాయి రవాణా, వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడే తనిఖీలు చేస్తున్నారు. దీంతో స్మగ్లర్లు, పెడ్లర్స్ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు కలిసి చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 108 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో ఓ […]
Anurag University Slab Collapsed: అనురాగ్ విశ్వవిద్యాలయంలో ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలోని వెంకటాపూక్ వద్ద ఉన్న అనురాగ్ విశ్వవిద్యాలయంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నీలిమ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కార్మికులు […]
Governor Jishnu Dev Varma: సికింద్రాబాద్‌లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత నెల 26 న గోల్కొండ జగదాంబ […]
Deputy CM Bhatti Vikramarka: కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరి పోయాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లడం లేదని మండిపడ్డారు. రూ.2 లక్షలు దాటిన రైతులకు రుణమాఫీ చేయొద్దని తమ ప్రభుత్వ విధాన […]
Ration Cards: తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. తద్వారా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 41 లక్షల మందికి […]
Telangana Governament Schools: ప్రభుత్వ బడుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ గవర్నమెంట్ ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం అభినందించారు. పదేళ్ల చీకట్లను పారదోలి, ప్రభుత్వ బడుల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛరణలతో పవిత్రతను సంతరించుకున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత పాలకులు వేసిన […]
Telangana Government: ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ. 5 కే టిఫిన్ అందించే పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ ఫాస్ట్ మెనూను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిద్ధం చేసింది. ఈ నిర్ణయంతో ప్రజల నుంచి ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం రూ. 5 మాత్రమే వసూలు చేయనుంది. మిగిలిన రూ. 14 ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఒక్క టిఫిన్ కు రూ. 19 ఖర్చు అవుతుందని అంచనా […]
Goshamahal MLA Raja Singh: హిందుత్వం కోసమే తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల బీజేపీకి ఆయన చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 11 ఏండ్ల కింద బీజేపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ తనను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు […]