Former MP Harish Rao: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించడానికి సీఎంకు సమయం లేదా…? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
Former MP Harish Rao Fire on Congress Government: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అందాల భామలను చూడటానికి సీఎం రేవంత్ రెడ్డి ఐదుసార్లు వెళ్లారని, కానీ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించడానికి సీఎంకు సమయం లేదా? అని ప్రశ్నించారు. విత్తన కొరత లేకుండా చేయలేని వ్యక్తికి సీఎం పదవి అవసరమా? అని అడిగారు.
తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ వైఖరిపై హరీష్ రావు విమర్శలు చేశారు. మార్పు, మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ మాత్రం ఏకంగా తెలంగాణ తల్లినే మార్చారన్నారు. ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన తల్లిన మార్చేశారని హరీష్ రావు అన్నారు. ఉద్యమంలో ఒక తల్లి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో తల్లి ఉంటుందా? అని అడిగారు.
తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిందన్నారు. ఆ తెలంగాణ తల్లి ఉద్యమంలో స్ఫూర్తి ఇచ్చిందన్నారు. తెలంగాణ తల్లి దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కాకతీయుల తోరణం తీసేస్తానని అంటారని విమర్శించారు. అలాగే చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తానని అంటాడని విమర్శలు చేశారు.